హైదరాబాద్‌ః నాలుగేళ్లలో రాష్ట్రంలోని అన్ని గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేయాల్సిందిగా ఆయన జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. కలెక్టర్ల సమావేశంలో శుక్రవారం నాడు పంచాయతీ రాజ్ శాఖ పనితీరును చంద్రబాబు సమీక్షించారు. పంచాయతీ రాజ్ శాఖకు సంబంధించి అధికారులు సరైన సమాచారం అందించలేక పోవడంపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.
హడ్కో ద్వారా 18 లక్షలు వ్యక్తిగత శానిటేషన్ దొడ్లు మంజూరు చేయిస్తే పంచాయతీ రాజ్ శాఖవారు వాటిని ఈ రోజువరకు పూర్తి చేయలేకపోయారని ఆయన తీవ్రస్వరంతో అన్నారు. గ్రామాల్లో సామూహిక మరుగుదొడ్ల నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించే విషయాన్ని పరిశీలించాల్సిందిగా చంద్రబాబు జిల్లా కలెక్టర్లను కోరారు.












Click it and Unblock the Notifications