న్యూఢిల్లీః తీవ్రవాద నిర్మూలనకు ప్రస్తుత చట్టాల్లో వున్న లోపాల్ని సవరించేందుకు కొత్త చట్టాలు అవసరం అని కేంద్ర హోం శాఖ మంత్రి ఎల్.కె. అద్వానీ తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ పోటోకు ఆమోదం సాధిస్తామని బుధవారం ఆయన స్పష్టం చేశారు. టాడా చట్టం కింద ఒక వ్యక్తినిఅరెస్టు చేసే అవకాశం వుంది కానీ అతనికి శిక్షించే అధికారం లేదనిఫిక్సి సమావేశంలో మాట్లాడుతూ అద్వానీ అన్నారు.అందుకోసమే పోటో చట్టాన్ని కేంద్ర ప్రతిపాదించిందని అద్వానీ చెప్పారు.
తీవ్రవాదం యావత్ ప్రపంచాన్ని కుదిపివేస్తున్న తరుణంలో పోటో వంటి చట్టాలు అవసరమని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ చట్టాన్ని అమలులోకి తేస్తామని అద్వానీధీమా వ్యక్తం చేశారు. ప్రతిపక్షాలు పోటోను వ్యతిరేకిస్తున్నప్పటికీ దేశ సంక్షేమం దృష్ట్యా ఆ చట్టాన్ని అమలులోకి తీసుకురావాలని కేంద్ర ప్రభుత్వం దృఢ సంకల్పంతో వున్నదని ఆయన చెప్పారు. సీమాంతర ఉద్రవాదం భారత దేశానికిపెనుముప్పుగా మారిందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications