న్యూఢిల్లీః సంఘ్‌పరివార్ దూకుడుకు అడ్డు లేకుండా పోయిందని కాంగ్రెస్ ప్రతినిధిజైపాల్‌రెడ్డి ఆరోపించారు. సంఘ్‌పరివార్‌పై బిజెపి నేతలు పూర్తిగా పట్టు కోల్పోయారని ఆయన విమర్శించారు. అయోధ్య విషయంలో విశ్వహిందూపరిషత్ వైఖరిని బిజెపి నేతలు ఇప్పటివరకు ఖండించకపోవడాన్ని ఆయన దుయ్యబట్టారు.
ఎన్‌డిఎ ఎజెండాకు కట్టుబడి వున్నామని చెబుతూనే హోం మంత్రి అద్వానీ సంఘ్ పరివార్ సిద్ధాంతాల ప్రచారానికి లభించిన ప్రతీ అవకాశాన్ని ఉపయోగించుకుంటున్నారని ఆయన చెప్పారు. మతతత్వానికి ఆజ్యంపోసే హోం మంత్రి వుండటం దేశప్రజల దురదృష్టమని ఆయన వ్యాఖ్యానించారు.
తెహల్కాపైవిచారణ సాగిస్తున్న వెంకటస్వామి కమిషన్ క్లీన్ చిట్ ఇవ్వకుండానే జార్జ్‌ఫెర్నాండెజ్‌కు మళ్లీ రక్షణ మంత్రి పదవిని కట్టబెట్టడాన్ని జైపాల్ తీవ్రంగావిమర్శించారు. తమ ప్రభుత్వంలో పేరుకుపోయిన అవినీతిని బయటపెట్టిన తహల్కా డాట్ కామ్‌ను ఎన్‌డిఎ ప్రభుత్వం పనిగట్టుకుని వేధిస్తున్నదని ఆయన ఆరోపించారు. ఇలాంటి వేధింపులు పత్రికలు, ప్రసారసాధనాలస్వేచ్ఛను హరిస్తాయని ఆయన పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications