బాన్‌ః ఐక్యరాజ్యసమితి సారథ్యంలో జర్మనీ నగరం బాన్‌లో అఎn్గాన్ కొత్త ప్రభుత్వంపై సాగుతున్న చర్చలు ఒక కొలిక్కివచ్చాయి. చర్చల్లో పాల్గొన్న నాలుగు ప్రధాన గ్రూప్‌లు అఎn్గాన్‌లో మధ్యంతర ప్రభుత్వం ఏర్పాటుకు సంబంధించిన ముసాయిదా ఒప్పందంపై బుధవారం నాడు సంతకాలు చేశాయి.
హమీద్ కర్జాయి కొత్తప్రభుత్వానికి సారధిగా వుంటారు. మాజీ రాజు జహీర్ షా కొత్త ప్రభుత్వ సారధిగా తన విధేయుడు పుష్తూ తెగ నేతఅయిన కర్జాయిపేరును ప్రతిపాదించారు. ప్రధాన గ్రూపులైన పష్తూన్ తెగ ప్రతినిధులు, నార్తర్న్ అలయన్స్ నేతలు కర్జాయి నాయకత్వానికిఅంగీకరించారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది. ఈ నెల 22న కొత్త ప్రభుత్వం కాబూల్‌లో బాధ్యతలనుస్వీకరించే అవకాశం వున్నట్టుగా సమితి ప్రతినిధి చెప్పారు.
కర్జాయి చైర్మన్‌గా 29 మంది సభ్యులతో ఏర్పడే మధ్యంతర ప్రభుత్వం ఆరునెలలపాటు అధికారంలో వుంటుంది. ఈ ప్రభుత్వం తర్వాత ఏర్పడే ఆపద్ధర్మ ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం చేస్తుంది. 18 నెలలపాటుఅధికారంలో వుండే ఆపద్ధర్మ ప్రభుత్వం సారథ్యంలో ఏన్నికలు జరుగుతాయి. విస్తృత ప్రతినిధి సభ లోయా జిర్గా రానున్న ఆరునెలల్లో ఈ ఆపద్ధర్మ ప్రభుత్వాన్ని నియమిస్తుంది.












Click it and Unblock the Notifications