న్యూఢిల్లీః భారత పార్లమెంటు భవనంతో పాటుబ్రిటన్, ఆస్ట్రేలియాల్లోని కీలక ప్రాంతాలపై బిన్ లాడెన్ సారధ్యం లోని అల్ ఖైదా గురిపెట్టింది.సెప్టెంబర్ 11న అమెరికాపై దాడి జరిపిన సమయంలోనే భారత్ పార్లమెంటుపైన కూడా దాడి చేయాలని అల్ ఖైదా యోచించిందని భారత హోం శాఖ మంత్రి ఎల్.కె. అద్వానీ చెప్పారు. ముంబయ్ లోఅరెస్టయిన ఓ తీవ్రవాది ఇచ్చి సమాచారం ఆధారంగా ఈవిషయం వెల్లడైందని ఆద్వానీ బుధవారం తెలిపారు.
ఆ తీవ్రవాది చెప్పినవిషయాలు దిగ్భ్రాంతి కలిగించేవిగా వున్నాయని,పెను మారణహోమానికి అల్ ఖైదా వ్యూహం పన్నిందని ఆయన చెప్పారు. ఆ తీవ్రవాది ఆస్ట్రేలియాలోపైలట్ గా శిక్షణ పొందాడని అద్వానీ వివరించారు. అయితే అతనిపేరు వెల్లడించేందుకు అద్వానీ నిరాకరించారు.












Click it and Unblock the Notifications