11న పార్లమెంట్‌లో పోటో
న్యూఢిల్లీః పోటోపై విపక్షాల మద్దతు కూడగట్టేందుకు అఖిలపక్ష సమావేశంలో విఫల ప్రయత్నం చేసిన ప్రధాని వాజ్‌పేయి ఈ చట్టం విషయంలో తాముపూర్తి పట్టుదలతో వున్నట్టుగా చెప్పారు. ఈ నెల 11న ఏదిఏమైనా పోటోను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టాలనినిర్ణయించినట్టుగా ప్రభుత్వం ప్రకటించింది.
కాగా పార్లమెంట్‌లో కూడా పోటోను నిర్ద్వంద్వంగా వ్యతిరేకించాలనివిపక్షాలు నిర్ణయించాయి. సిపిఎం నేత సోమనాథ్ చటర్జీ ఇంట్లో బుధవారం నాడు ఉదయం ప్రధాన ప్రతిపక్షాల ప్రతినిధులు సమావేశమయ్యారు.
ఈ సమావేశంలో పోటోను వ్యతిరేకించనున్నట్టుగావిపక్షాల నేతలు ప్రకటించారు. ఇదిలా వుండగా అయోధ్యలో బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన జరిగి దశాబ్దం కావస్తున్నా ప్రభుత్వం ఇంతవరకు నిందితులపై చర్య తీసుకోలేదనివిపక్షాల నేతలు విమర్శించారు. బాబ్రీ సంఘటనకు నిరసనగా డిసెంబర్ ఆరు గురువారం నాడు బ్లాక్‌డే పాటించనున్నట్టుగా వారు ప్రకటించారు.












Click it and Unblock the Notifications