హైదరాబాద్‌ః హైదరాబాద్ కార్పొరేషన్ కు త్వరలో జరగబోయే ఎన్నికల్లో తెలంగాణా రాష్ట్ర సమితి, తెలంగాణా సాధన సమితి ఉమ్మడిగా పోటీ చేయనున్నాయి. టిఎస్‌ఎస్ అధినేత, బిజెపిఎం.పి. నరేంద్ర బుధవారం ఈ విషయాన్ని వెల్లడించారు. టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర రావుతో ఈవిషయంపై ప్రాధమికంగా చర్చించామని ఆయన చెప్పారు. అయితే మేయర్ పదవికి తెలంగాణా సాధన సమితి అభర్థినే బరిలోకి దించుతామని ఆయన చెప్పుకున్నారు.
రాష్ట్రరాజధాని పరిసరాల్లోని మూడొంతుల భూమి కోస్తా జిల్లాలకు చెందిన భూ పెత్తందార్ల చేతుల్లో వున్నదని,వీరు ఈ భూములను ప్రభుత్వ రాయితీలతో పొందారని నరేంద్ర ఆరోపించారు. హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో తెలంగాణా పార్టీలు తమ సత్తా చూపిస్తాయని నరేంద్ర చెప్పారు.












Click it and Unblock the Notifications