కాబూల్‌ః ఆఫ్ఘనిస్తాన్ పై పట్టు సంపాదించి తాలిబన్లకు మద్దతు ఇవ్వడం ద్వారా కాశ్మీర్ లో తీవ్రవాదాన్ని ఎగదోయాలని పాకిస్తాన్ వ్యూహం పన్నుతున్నదని ఆఫ్ఘనిస్తాన్‌మిలటరీ జనరల్ మహమ్మద్ జహీర్ అక్బర్ అన్నారు. ఆఫ్ఘనిస్తాన్ ను ఇంకాసర్వనాశనం చేసి, ఇక్కడి తీవ్రవాదుల్ని కాశ్మీర్ ను నాశనం చేసేందుకు పంపాలనేదే పాక్ కుట్ర అని ఆయన బుధవారం ఆరోపించారు. పాక్ పన్నాగాలను తిప్పికొడతామని ఆయన స్పష్టం చేశారు. పాక్ గూఢచారి సంస్థ ఐఎస్‌ఐ ఆఫ్ఘనిస్తాన్ ను తన తీవ్రవాద కార్యకలాపాలకు అడ్డాగా వాడుకొనే ప్రయత్నాలు ఇంకా చేస్తునే వున్నదని ఆయన అన్నారు.
ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాద వ్యవస్థను సమూలంగా రూపుమాపుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రజల సహకారంతో తీవ్రవాదుల్ని ఏరివేయడంపెద్ద కష్టం కాదని ఆయన అన్నారు. పాకిస్తాన్ తో ఎటువంటి శత్రుత్వం లేదని అయితే ఆఫ్ఘనిస్తాన్ లో తీవ్రవాదాన్ని ప్రోత్సహించే ప్రయత్నాలను మాత్రం సహించమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications