హైదరాబాద్‌ః నిరంతరంవిమర్శలు, ప్రతివిమర్శలతో ఆగర్భ శత్రువుల్లా వ్యవహరించే అధికార, ప్రతిపక్ష నేతలు బుధవారం కరచాలనాలు, చిరునవ్వులతో పలకరింపులు, ఛలోక్తులతో సరదాగా గడిపారు.అసెంబ్లీ సమావేశాలకు ముందు అన్ని పార్టీల నేతలకుస్పీకర్ అల్పాహార విందు ఇవ్వడం ఆనవాయితీగా వస్తున్నది.అసెంబ్లీ శీతాకాల సమావేశాల ప్రారంభం సందర్భంగాస్పీకర్ ప్రతిభాభారతి బుధవారం ఉదయం అల్పాహారవిందు ఇచ్చారు. ఈ విందులో ప్రతిపక్ష నేత వై.ఎస్. రాజశేఖర రెడ్డి, వామపక్ష నేతలు, బిజెపి, మజ్లిస్ నేతలతో పాటు ఇటీవల జరిగిన ఉపఎన్నికల్లో సిద్దిపేట నుంచి గెలుపొందిన టిఆర్‌ఎస్ అధినేత చంద్రశేఖర రావు పాల్గొన్నారు.
ఈవిందులో వై.ఎస్. చంద్రబాబు నాయుడు సరదాగా ఛలోక్తులువిసురుకున్నారు. వివిధ పార్టీలకు చెందిన నేతలు పరస్పరం కలచాలనాలు, అభివాదాలు, సరదా కబుర్లతో జూబ్లీహాలులో ఉల్లాస వాతావరణం నెలకొంది. ఆ తరువాతఅసెంబ్లీ సమావేశాల ప్రారంభం సందర్భంగా కూడా వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్ల్యేలుస్నేహపూర్వకంగా పలకరించుకున్నారు. చంద్రబాబు నాయుడు సభలోకి రాగానే వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్ల్యేలతో కరచాలనం చేశారు. మంత్రులు కూడా ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలను పలకరించి తమస్థానాల్లో ఆసీనులయ్యారు.












Click it and Unblock the Notifications