న్యూఢిల్లీః డిసెంబర్ 13న భారత పార్లమెంటుపై జరిగిన దాడి దేశానికేపెద్ద సవాలు అని ప్రధాని వాజ్ పేయి అన్నారు. యుద్ధం చేయాలా వద్దా అనేది ప్రస్తుత సమస్య కాదని ఏ పరిస్థితుల్లో అటువంటి నిర్ణయం తీసుకోవాలనేవిషయాన్ని మనం చర్చించాలని వాజ్ పేయి అన్నారు. పార్లమెంటుపై జరిగిన దాడిపై మంగళవారం ప్రారంభమైన చర్చ బుధవారం కూడా కొనసాగింది. ఈఅంశంపై చర్చ జరుగుతుండగా వాజ్ పేయి జోక్యం చేసుకొని ఈ వ్యవహారాన్ని దయచేసి రాజకీయం చేయవద్దనికోరారు.
ఇది మన సమస్య...... మనమే పోరాడదాం అని ఆయన హర్షధ్వానాల మధ్య చెప్పారు. పార్లమెంటుపై దాడికి బాధ్యులు ఎవరు? వారిని పంపింది ఎవరు? తదితరవిషయాలన్నింటినీ పరిశీలించి ఎటువంటి చర్యతీసుకోవాలో నిర్ణయించాలని వాజ్‌పేయి అన్నారు. కార్గిల్ వ్యవహారంలో సకాలంలో స్పందించకపోతే భారత్ భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చేదని వాజ్‌పేయి సభకు గుర్తు చేశారు.
భద్రతాలోపంః సోనియా
అంతకు ముందు ప్రతిపక్ష నాయకురాలు సోనియా గాంధీ మాట్లాడుతూ పార్లమెంటుపై జరిగిన దాడిఅంశంపై అద్వానీ ప్రకటన చప్పగా వుందని విమర్శించారు. పార్లమెంటు వద్ద భద్రతను కట్టుదిట్టం చేయాల్సిన అవసరాన్ని ఆమె నొక్కిచెప్పారు. భారత పార్లమెంటుపై దాడి జరిపిన వారిపై కఠిన వైఖరి అవలంబించాలని కూడా అమె సభ్యులహర్షధ్వానాల మధ్య చెప్పారు. ఈ దిశగా ప్రభుత్వం తీసుకొని ఏ చర్యనైనా తమ పార్టీ మనస్పూర్తిగా సమర్థిస్తుందని సోనియా హామీ ఇచ్చారు. అయితే ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకొనే ముందు ప్రతిపక్షాలను సంప్రదించాలని ఆమెకోరారు.












Click it and Unblock the Notifications