సరిహద్దులో గుంటూరు జవాను మృతి
గుంటూరు : భారత సరిహద్దుల్లో భారత్, పాక్‌లకు మధ్య జరుగుతున్న ఘర్షణల్లో గుంటూరు జిల్లాలకు చెందిన షేక్ మీరావలి(30) అనే జవాను మృతి చెందాడు. మీరావలి గుంటూరు జిల్లా అమృతలూరు గ్రామానికి చెందినవాడు. జలంధర్ 10వ ఇంజనీర్ రెంజ్మింటులో బుల్‌డోజర్ ఆపరేటర్‌గా పనిచేస్తున్న మీరావలి రాజస్ధాన్ సరిహద్దుల్లో జరిగిన మైన్‌బ్లాస్ట్‌లో ప్రాణాలొదిలినట్టు ఆదివారం నాడు జలంధర్‌నుంచి మీరావలి కుటుంబ సభ్యులకు సమాచారం అందింది.
నిరుపేద కుటుంబానికి చెందిన మీరావలి 1990వ సంవత్సరంలో ఆర్మీలో చేరాడు. మీరావలి మరణవార్త తెలిసి ఈ ప్రాంత ప్రజలు శోకసముద్రంలో మునిగిపోయారు.












Click it and Unblock the Notifications
