తిరుమలలో అరుదైన ఘట్టం: తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేర్లతో.. !!

తిరుమల శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ఏడో రోజు సోమవారం రాత్రి శ్రీ మలయప్పస్వామివారు చంద్రప్ర‌భ వాహ‌నంపై మురళీకృష్ణుడి అలంకారంలో భ‌క్తుల‌ను క‌టాక్షించారు. వాహన సేవ సమయంలో వర్షం పడటంతో ఘటాటోపంలో స్వామివారు భక్తులకు అభయం ఇచ్చారు. స్వామివారి దివ్య మంగళరూపాన్ని దర్శించేందుకు తరలివచ్చిన భక్తులను దేశంలోని వివిధ ప్రాంతాల కళాకారులు తమ సంప్రదాయ నృత్య, సంగీత, జానపద కళారూపాలతో అలరించారు.

చంద్రుడు శివునికి శిరోభూషణమైతే ఇక్కడ శ్రీహరికి వాహనంగా ఉండడం విశేషం. చంద్రప్రభ వాహనంపై స్వామివారిని చూడగానే భక్తుల మనసు ఉప్పొంగుతుంది. ఆధ్యాత్మిక, ఆదిభౌతిక, ఆది దైవికమనే మూడు తాపాలను ఇది నివారిస్తుంది. ఏపీ, తమిళనాడు, జార్ఖండ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, సిక్కిం, గుజరాత్ రాష్ట్రాలకు చెందిన 22 కళాబృందాలు, 589 మంది కళాకారులు ఈ వాహనసేవలో పాల్గొన్నారు.

Divine Grandeur at Tirumala Mandapam Snapana Tirumanjanam Honors Utsava Deities Sri Malayappa Swamy

అంతకుముందు బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారికి స్నపన తిరుమంజన కార్యక్రమం వైభవంగా సాగింది. తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరు, డ్రై ఫ్రూట్స్, గాజులు, వక్క ఆకులు తదితరాలతో రూపొందించిన విశేష మాలల మధ్య స్వామి, అమ్మవార్లు దివ్య అలంకారంలో భక్తులను అనుగ్రహించారు. శ్రీవారి ఆలయ ప్రాంగణంలోని రంగనాయకులవారి మండపంలో అర్చకస్వాములు వేదమంత్రోచ్ఛారణల మధ్య వైఖానస ఆగమోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు.

కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి కీ పోస్టింగులు: ఈ జిల్లాలకు నూతన ఎస్పీలు
కాంతి రాణా టాటా, విశాల్ గున్నికి కీ పోస్టింగులు: ఈ జిల్లాలకు నూతన ఎస్పీలు

శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారి ఉత్సవమూర్తులను ప్రత్యేక వేదికపై ఆశీనులను చేసి రంగురంగుల పుష్పాలతో సుందరంగా అలంకరించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లకు పాలు, పెరుగు, కొబ్బరినీళ్లు, తేనె, పసుపు, గంధంతో విశేష అభిషేకం చేశారు. శంఖనిధి, పద్మనిధి, సహస్రధార, కుంభధారణలతో శాస్త్రోక్తంగా స్నపనం నిర్వహించారు. టీటీడీ వేద పారాయణదారులు ఉపనిషత్ మంత్రాలు, దశశాంతి మంత్రాలు, పురుషసూక్తం, శ్రీసూక్తం, భూసూక్తం, నీలాసూక్తం, విష్ణుసూక్తం తదితర పంచసూక్తాలను భక్తిభావంతో పారాయణం చేశారు.

అభిషేకానంతరం తిరుమల పెద్ద జీయ్యంగార్, చిన్న జీయ్యంగార్ వివిధ దివ్య పాశురాలను పఠించారు. ఈ వేడుకలో భాగంగా తెల్ల ముత్యాలు, వట్టివేరు, కురువేరు, డ్రై ఫ్రూట్స్, గాజులు, వక్క ఆకులు, పసుపు రేకులు, రోజాలు, బటన్ చామంతి మాలలతో స్వామి, అమ్మవార్లను విశేషంగా అలంకరించారు. సుగంధ పరిమళాలు, పుష్పాల సౌరభం, వేదఘోషలు, భక్తిభావంతో రంగనాయకుల మండపం ఆధ్యాత్మిక శోభతో విరాజిల్లింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+