మరో 25 లక్షల ఇళ్ళలో దీపం

కరీంనగర్‌ః రాష్ట్రంలో దీపం పథకం కింది మరో 25లక్షల గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేయనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వెల్లడించారు. 16వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు గురువారం ఉత్తర తెలంగాణా జిల్లాల్లో పర్యటించారు. ఆదిలాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో ఆయన విస్తృతంగా పర్యటించారు. కరీంనగర్‌ జిల్లాలో పర్యటించిన చంద్రబాబు నాయుడు వివిధ అభివృద్ధి పథకాలను సమీక్షించారు. కరీంనగర్‌ జిల్లాల తంగిళ్ళపల్లి గ్రామసభలో మాట్లాడుతూ రాష్ట్ర మహిళా వికాసానికి మరో 25 లక్షల గ్యాస్‌ కనెక్షన్లు మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
రాష్ట్రంలో పేదరికం నిర్మూలన జరిగే వరకు అభివృద్ధి పథకాలను నిలిపే ప్రసక్తి లేదని చంద్రబాబు హామీ ఇచ్చారు.

నక్సలైట్ల చర్యలను చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా తీవ్రంగా విమర్శించారు. ఒక దారితెన్ను లేకుండా నక్సలైట్లు రాష్ట్రంలో అరాచకం సృష్టిస్తూ... అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన విమర్శించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+