పెట్రోల్, డీజిల్, ఎల్పీజీ ధరల పెంపు ఖరారు..! లీటరు ఎంతంటే, గ్యాస్ ఇలా..!

ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగియడంతో దేశంలో పెట్రోల్ , డీజిల్, గ్యాస్ (petrol, diesel and lpg )ధరల్ని పెంచేందుకు కేంద్రం సిద్దమైంది. ఇవాళ కమర్షియల్ గ్యాస్ సిలెండర్ ధరను ఏకంగా రూ.993 పెంచేసిన కేంద్రం.. ఇప్పుడు పెట్రోల్, డీజిల్ ధరలతో పాటు గృహ అవసరాల గ్యాస్ సిలెండర్ ధర కూడా పెంచేందుకు సిద్దమైంది. ఈ మేరకు ఎంతెంత పెంచుతారనే దానిపై సంకేతాలు కూడా ఇచ్చేసింది. మరో నాలుగైదు రోజుల్లో ఈ పెంపు ఉండబోతోంది.

ఎల్లుండి పెట్రో ధరల పెంపు ? తేల్చేసిన కేంద్రం ..!
ఎల్లుండి పెట్రో ధరల పెంపు ? తేల్చేసిన కేంద్రం ..!

పశ్చిమ ఆసియాలో ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయంగా పెరుగుతున్న ముడిచమురు ధరల ప్రభావం భారత్ పైనా పడుతోంది. దీంతో చమురు (fuel)తో పాటు ఎల్పీజీ సిలిండర్ల ధరలను పెంచే అవకాశం ఉందని కేంద్రం సంకేతాలు ఇచ్చింది. ఈ మేరకు పెట్రోల్, డీజిల్ ధరలు లీటరుకు సుమారు రూ. 4-5 వరకు పెరగవచ్చని తెలుస్తోంది. కాగా దేశీయ ఎల్పీజీ సిలిండర్ల ధరలు దాదాపు రూ.40-50 వరకు పెరగొచ్చు.

Petrol Diesel and LPG Prices Set to Rise Here Is How Much You Will Pay More
త్వరలో పెట్రో ధరల పెంపు ? ఇవాళ గ్యాస్ రేట్ల పెంపు తర్వాత అదేనా..!
త్వరలో పెట్రో ధరల పెంపు ? ఇవాళ గ్యాస్ రేట్ల పెంపు తర్వాత అదేనా..!

కేంద్రం దీన్ని ఆమోదిస్తే.. దాదాపు నాలుగేళ్లలో పెట్రోల్, డీజిల్ ధరలలో ఇదే మొదటి పెంపు అవుతుంది. 2022 నుంచి రిటైల్ ధరలు పెరగలేదు. ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలపై ఒత్తిడి పెరుగుతున్నందున ఇంధన ధరల పెంపుకు కేంద్రం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. అయితే అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే ధరలు పెంచే అవకాశం లేదని ప్రభుత్వం ఈ మధ్యే స్పష్టం చేసింది. అయితే రిటైల్ ఇంధన ధరలలో మార్పు లేకపోవడంతో, చమురు కంపెనీలు నష్టాలను భరిస్తున్నాయి. దీనివల్ల రాబడి తగ్గిపోతోంది. దీంతో రాబోయే 5-7 రోజుల్లో ధరల పెంపుపై ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. చమురు, ఎల్‌పిజి ధరల పెంపు గృహ బడ్జెట్‌లు, రవాణా ఖర్చులపై భారీ ప్రభావాన్ని చూపనుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+