నక్సలైట్ల అడ్డుకున్నా ప్రగతిఆగదుః బాబు
ఆదిలాబాద్‌ః నక్సలైట్లు ఎన్ని బెదిరింపులకు పాల్పడినా ఆంధ్రరాష్ట్రంలో మారుమూల పల్లెల అభివృద్ధిపై వెనక్కు తగ్గేది లేదని చంద్రబాబు నాయుడు ప్రకటించారు. 16వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా గురువారం ఆయన ఉత్తర తెలంగాణా జిల్లాల్లో పర్యటించారు. ఆదిలాబాద్ జిల్లా జైనూరులో జరిగిన గ్రామసభలో చంద్రబాబు నాయుడు ప్రసంగించారు. రాష్ట్రంలో భయోత్పాతం సృష్టించేందుకు పీపుల్స్ వార్ హత్యలు, కిడ్నాప్ లకు పాల్పడుతున్నదని చంద్రబాబు విమర్శంచారు.
16వ విడత జన్మభూమి కార్యక్రమం రెండో రోజున రాష్ట్ర వ్యాప్తంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షించారు. మంత్రులు, అధికారులు, ఎమ్మెల్ల్యేలు జిల్లాల్లో విస్తృత స్థాయిలో పర్యటించి అభివృద్ధి కార్యక్రమాలను సమీక్షిస్తున్నారు. ప్రతిపక్షాలు అధికారంలో వున్న ప్రాంతాల్లో ప్రజలు అధికారులను నిలదీస్తున్నారు.












Click it and Unblock the Notifications