ఉగ్రవాదం పాక్ వేదంః వాజ్‌పేయి
లక్నోః ఉగ్రవాదాన్ని విడనాడేందుకు పాకిస్తాన్ సిద్ధంగా లేదని భారత ప్రధాని వాజ్ పేయి ధ్వజమెత్తారు. గత కొద్ది రోజులుగా పాకిస్తాన్ వైఖరిని పరిశీలిస్తే ఈ విషయం స్పష్టం అవుతుందని ఖాట్మండూకు బయలుదేరే ముందు ఆయన లక్నోలో విలేకరులతో అన్నారు. ఇప్పటి వరకు తన భూభాగంలో వున్న తీవ్రవాద సంస్థలపై పాకిస్తాన్ కంటితుడుపు చర్యలు మాత్రమే తీసుకున్నదిని ఆయన అన్నారు. తీవ్రవాద సంస్థలపై పాకిస్తాన్ తీసుకున్న చర్యల పూర్తి వివరాలు భారత్ కు కావాలి.... డిసెంబర్ 13న భారత్ పార్లమెంటుపై దాడి జరిపిన వారిపై పాక్ చర్య తీసుకున్నదీ లేనిదీ తేలాలి అని వాజ్ పేయి అన్నారు.












Click it and Unblock the Notifications