ఉత్తరభారతంలో భూకంపం

న్యూఢిల్లీః గురువారం మధ్యాహ్నం పెను భూకంపం ఉత్తర భారతాన్ని కుదిపివేసింది. రెక్టర్‌ స్కేలుపై ఈ భూకంపం తీవ్రత 5.8గా నమోదైంది. ఆఫ్ఘన్‌ రాజధాని కాబూల్‌ కు ఈశాన్య భాగంలో 150 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమైన ఈ భూకంపం తీవ్రతకు ఢిల్లీ, జమ్మూ, పంజాబ్‌, హర్యానాల్లో ప్రకంపనాలు సంభవించాయి. గురువారం మధ్యాహ్నం 12.35 గంటలకు సంభవించిన ఈ భూకంపం 46 సెకండ్ల పాటు కొనసాగింది.

భూకంపం కారణంగా ఇస్లామాబాద్‌, పెషావర్‌, కాబూల్‌, మజారే షరీఫ్‌ లలో భూ ప్రకంపనలు సంభవించాయి. భూకంపం కారణంగా ఏ విధమైన నష్టం సంభవించినట్లు సమాచారం అందలేదు. భూమి లోపల 130 కిలోమీటర్ల దూరంలో భూకంపం కేంద్రీకృతమైనట్లు వాతావరణ శాఖ అధికారులు చెప్పారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+