మతసంస్థలపై వేటుకు పాక్ సన్నాహం
ఇస్లామాబాద్‌ః ఉగ్రవాద నిర్మూలనకు పాకిస్తాన్ నడుంకట్టాలంటూ అమెరికా తదితర దేశాల నుంచి ఒత్తుళ్ళు పెరుగుతున్న తరుణంలో కొన్ని మతసంస్థలపై పాక్ నిషేధం విధించే అవకాశాలున్నా యంటున్నారు. పాక్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ జాతినుద్దేశించి ప్రసంగించడానికి ముందే జిహాద్ గ్రూపులకు నిధులు, ఆయుధాలు అందించే కొన్ని సంస్థలపై పాక్ ప్రభుత్వం నిషేధం వేటు వేసే అవకాశాలున్నట్లు ఇస్లామాబాద్ వర్గాల ద్వారా తెలిసింది.
పాక్ భూభాగంలో జీహాద్ కార్యకలాపాలు నిర్వహించే సంస్థలేవీ లేవని ఆయన స్పష్టం చేశారు. అయితే జీహాద్ సంస్థలకు ఇక్కడ వున్న వారు ఎవరైనా నిధులు సమకూర్చుతుంటే మాత్రం పాకిస్తాన్ శ్రేయస్సుకు అది మంచిది కాదని ఘాజి అన్నారు. మొత్తం మీద నానాటికీ పెరుగుతున్న ఒత్తిళ్ళ దరిమిలా మత సంస్థలపై పాక్ కంటితుడుపు చర్యలైనా తీసుకొనే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications