పెట్రోల్ ధర తగ్గింపు
న్యూఢిల్లీఃపెట్రోలు, డీజిల్ పై ఎక్సైజ్ సుంకాలను కేంద్రప్రభుత్వం భారీగా హెచ్చించింది. అదేసమయంలో పెట్రోల్, డీజిల్ ధరలను స్వల్పంగాతగ్గించింది. పెట్రోల్ ధరను లీటర్‌కు 1.39రూపాయలు, డీజిల్ లీటర్‌కు ఎనిమిది పైసల చొప్పునతగ్గించారు. పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకాన్నిప్రస్తుత 32 శాతం నుంచి 90 శాతానికి పెంచారు. డీజిల్‌పైమాత్రం సుంకాన్ని 16 నుంచి 20 శాతానికి హెచ్చించారు. కొత్తరేట్లు వెంటనే అమల్లోకి వస్తాయని కూడాప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు ఆర్ధికమంత్రిత్వ శాఖనుంచి ఒక నోటిఫికేషన్‌వెలువడింది. సరిహద్దుల్లో నెలకొన్నఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో ఎక్సైజ్,కస్టమ్స్ సుంకాల రేట్ల పెంపునకు ఆర్ధికమంత్రిత్వ శాఖకు ఈ మధ్యనే కేంద్రమంత్రి మండలి అసాధారణ అధికారులుకట్టబెట్టిన విషయం విదితమే.శుక్రవారం నాడు ఆర్ధిక మంత్రి యశ్వంత్ సిన్హా,పెట్రోలియం శాఖ మంత్రి రామ్ నాయక్‌సమావేశమై చర్చలు జరిపారు. ఈ ఇద్దరుమంత్రుల చర్చల దరిమిలా సుంకాలనుపెంచుతున్న వార్త వెలువడింది.












Click it and Unblock the Notifications