వార్ బృందం లొంగుబాటు
కరీంనగర్‌ఃకరీంనగర్ జిల్లాకు చెందిన పీపుల్స్‌వార్ ముఖ్యనాయకుడుఒకరు తన భార్య, సహచరులతో పాటుపోలీసుల ఎదుట లొంగిపోయాడు. జిల్లా పీపుల్స్‌నేతల్లో ముఖ్యడైన జర్రిపోతులసంపత్ అలియాస్ ఐలన్న ఆయన భార్య బియ్యాలభాగ్య వార్ గెరిల్లా దళానికి చెందిన మరోనలుగురు నక్సలైట్లు కరీంనగర్ రేంజ్ డిఐజిగౌతంసావంగ్ ఎదుట శుక్రవారం నాడు లొంగిపోయారు. సంపత్‌పైపదికి పైగా హత్యకేసులు వున్నట్టుగాపోలీసులు చెప్పారు. వార్ సిద్ధాంతాల్లో వచ్చినమార్పుల వల్ల తాము అజ్ఞాత జీవితానికి స్వస్తిచెప్పి లొంగిపోవాలని నిర్ణయించినట్టుగా ఐలన్నతెలిపారు. గెరిల్లా ఆర్మీ ఏర్పాటును తాము మొదటినుంచివ్యతిరేకించినట్టు చెప్పారు. ఈ వార్ నక్సల్స్‌తోపాటు మరో ఇద్దరు జనశక్తి నక్సల్స్ కూడాపోలీసుల ఎదుట లొంగిపోయారు. ఇదిలావుండగా కరీంనగర్ జిల్లా కాటారం అటవీప్రాంతంలో పీపుల్స్‌వార్ ఆయుధ నిల్వలను కూడాపోలీసులు పట్టుకున్నారు. రైఫిళ్లు, క్లైమోర్‌మైన్లు,మందుపాతరలు ఈ డంప్‌లో వున్నట్టుగాగౌతంసావంగ్ చెప్పారు. ప్రజల్లో పీపుల్స్‌వార్‌పట్ల వ్యతిరేకత బలంగా వున్నదనిప్రజలను వారి హక్కుల గురించిచైతన్యపర్చి, పీపుల్స్‌వార్ హింసాకాండగురించివివరించి నక్సలైట్లను ఏకాకులనుచేస్తున్నట్టుగా పోలీసు అధికారులు చెప్పారు.












Click it and Unblock the Notifications