రాష్ట్ర బడ్జెట్ ముసాయిదా విడుదల
హైదరాబాద్: రాష్ట్ర వార్షికబడ్జెట్ ముసాయిదాను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు మంగళవారం విడుదల చేశారు. నేరుగా శాసనసభలో ప్రవేశపెట్టకుండాబడ్జెట్ ముసాయిదాను విడుదల చేయడం విశేషం.
బడ్జెట్ ముసాయిదాతో పాటు 16 శాఖలకు సంబంధించిన వ్యూహాత్మక పత్రాలను కూడా ముఖ్యమంత్రి విడుదల చేశారు. ప్రణాళికేతర వ్యయం నిరుటి కన్నా 10.8 శాతం పెరుగుతుందని ముసాయిదాబడ్జెట్ అంచనా వేశారు. 7,300 కోట్ల రూపాయల ద్రవ్య లోటు వుండగలదనిఅంచనా. ప్రణాళికా పెట్టుబడులను 11.1 శాతం పెంచుతారు.
ప్రైవేట్ పెట్టుబడులను ప్రోత్సహించడానికి, సామాజిక భాగస్వామ్యాన్ని పెంచడానికి ప్రాధాన్యం ఇవ్వాలని వ్యూహ పత్రాల్లోపేర్కొన్నారు. కరెంట్‌పై ఇస్తున్న సబ్సిడీని వచ్చే కొన్నేళ్లలో పూర్తిగా తగ్గించనున్నట్లు కూడా చెప్పారు.












Click it and Unblock the Notifications
