ఈ ఆస్ట్రేలియా స్టార్ ఆల్ రౌండర్ ఒకింటి వాడయ్యాడు.. !!

ఆస్ట్రేలియా క్రికెట్ జట్టు ఆల్‌రౌండర్ కామెరాన్ గ్రీన్.. తన జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించాడు. తన ప్రియురాలు, మోడల్ ఎమిలీ రెడ్‌వుడ్‌ను పెళ్లి చేసుకున్నాడు. వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాడు. ఈ వివాహ వేడుకకు సంబంధించిన మధుర క్షణాలను కామెరాన్.. తన సోషల్ మీడియాలో పంచుకోవడంతో ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్ అయ్యాయి. క్రీడా ప్రపంచంతో పాటు అభిమానుల నుంచి ఈ నూతన దంపతులకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి.

ఆస్ట్రేలియా తీరప్రాంతంలో అతి కొద్దిమంది సన్నిహితులు, కుటుంబ సభ్యుల సమక్షంలో వీరి వివాహం జరిగింది. దాదాపు నాలుగేళ్లకు పైగా ప్రేమాయణం సాగించిన ఈ జంట.. చివరికి పెద్దల అంగీకారంతో పెళ్లి పీటలు ఎక్కింది. తెలుపు రంగు వెడ్డింగ్ గౌనులో ఎమిలీ రెడ్‌వుడ్ దేవకన్యలా రిసిపోగా, క్లాసిక్ సూట్‌లో గ్రీన్ హుందాగా కనిపించాడు. వీరిద్దరూ కలిసి కొత్త జీవితాన్ని ప్రారంభిస్తున్న తరుణంలో అభిమానులు ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోన్నారు.

Cameron Green Marries Emily Redwood and shared a Sweet Wedding Moments Highlights Love and Joy

కామెరాన్ గ్రీన్ వ్యక్తిగత జీవితంలో ఎమిలీకి ఉన్న స్థానం ఎంతో ప్రత్యేకం. ఆమె.. వృత్తిరీత్యా డైటీషియన్. పీహెచ్డీ సైతం పూర్తి చేశారు. కామెరాన్ కెరీర్ ఎదుగుదలలో కీలక పాత్ర పోషించారు. అతని ఆరోగ్య విషయంలోనూ వెన్నంటి నిలిచారు. గ్రీన్ చిన్నతనం నుండి ఎదుర్కొంటున్న క్రానిక్ కిడ్నీ డిసీజ్.. మూడో దశలో ఉన్న తరుణంలో ఆమె అతనికి అందించిన మానసిక ధైర్యం, ప్రత్యేక ఆహార ప్రణాళికలు అతన్ని ఓ సక్సెస్ ఫుల్ క్రికెటర్ గా నిలబెట్టాయి.

రేపట్నుంచి టీమిండియా టీ20 జాతర
రేపట్నుంచి టీమిండియా టీ20 జాతర

ఆస్ట్రేలియాలో మ్యాచ్ విన్నర్‌గా పేరు తెచ్చుకున్న కామెరాన్.. గ్రౌండ్ లో ఎంత చురుగ్గా ఉంటాడో, వ్యక్తిగత విషయాల్లో అంత ప్రైవసీని ఇష్టపడతాడు. ఈ కారణంగానే తమ పెళ్లి వేడుకను ఎలాంటి హడావుడి లేకుండా నిరాడంబరంగా జరుపుకొన్నారు. తమ సుదీర్ఘ ప్రేమ బంధం వివాహ బంధంగా మారిన క్షణాన్ని జీవితాంతం గుర్తుంచుకునేలా ఒక మధుర జ్ఞాపకంగా మార్చుకున్నామని పోస్ట్ చేశాడు.

తిరుమలకు వెళ్లే ప్రైవేట్ వాహనాలపై తేల్చి చెప్పిన టీటీడీ
తిరుమలకు వెళ్లే ప్రైవేట్ వాహనాలపై తేల్చి చెప్పిన టీటీడీ

ఇటీవల వెన్నునొప్పి కారణంగా శస్త్రచికిత్స చేయించుకున్న ఈ ఆల్ రౌండర్.. భారత్ తో జరిగిన ప్రతిష్టాత్మక బోర్డర్-గవాస్కర్ ట్రోఫీ టెస్ట్ సిరీస్‌కు దూరం కావాల్సి వచ్చింది. సర్జరీ తర్వాత దాదాపు ఆరు నెలల పాటు ఆటకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సుదీర్ఘ విరామ సమయాన్ని అతడు తన పెళ్లికి ఉపయోగించుకున్నాడు. శస్త్రచికిత్స అనంతరం తగిన విశ్రాంతి తీసుకుంటున్న గ్రీన్, పెళ్లి వేడుక ముగిసిన వెంటనే తిరిగి తన ఫిట్‌నెస్‌ సాధనపై దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+