గ్రామీణ న్యాయస్థానాలు: దేవేందర్
హైదరాబాద్: గ్రామ సచివాలయాల మాదిరిగా రాష్ట్రంలో గ్రామీణ న్యాయ స్థానాలను ఏర్పాటు చేయనున్నట్లు రాష్ట్ర హోం మంత్రి తూళ్ల దేవేందర్ గౌడ్ చెప్పారు. పోలీసు రిట్రీట్ ముగింపు సమావేశంలో ఆయన మంగళవారం ప్రసంగించారు.
నిరుడు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధన పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ ఏడాది ఒక్క లాకప్ మరణం కూడా సంభవించకుండా జాగ్రత్త పడాలని ఆయన పోలీసు అధికారులకు సూచించారు. లాకప్ మరణాలు గణనీయంగా తగ్గాయని ఆయన చెప్పారు. వ్యవస్థీకృత నేరాలను అదుపు చేయడంపై దృష్టి కేంద్రీకరించాల్సి వున్నదని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications
