వెనక్కి తగ్గేది లేదు: విహెచ్‌పి
న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణంపై ప్రభుత్వంతో మళ్లీ చర్చలు జరిపే ప్రసక్తి లేదనివిశ్వహిందూ పరిషత్ స్పష్టం చేసింది. మార్చి 12వ తేదీ తర్వాత రామాలయ నిర్మాణం చేపడుతామని ప్రకటించింది.
రామాలయ నిర్మాణం విషయంతో తమ గడువును వాయిదా వేయబోమని, ఏ పరిస్థితుల్లోనూ తమ కార్యక్రమాన్నివిరమించబోమని విశ్వహిందూ పరిషత్ (విహెచ్‌పి) అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ తొగాడియా మంగళవారం విలేకరులతో చెప్పారు.
ప్రధాని వాజ్‌పేయిని హిందూ వ్యతిరేకిగా భావిస్తున్నారా అని అడిగితే మార్చి 12వ తేదీ వరకు ఆ మాట అనబోమని ఆయన జవాబిచ్చారు.వివాద రహిత స్థలాన్ని అప్పగించడానికి కొంత మేరకు ప్రధాని చర్యలు తీసుకున్నారని ఆయన అన్నారు. 1993లో పివి నరసింహారావు ప్రభుత్వం తీసుకున్న భూమిని తిరిగి తమకు అప్పగించడమే ఇప్పుడు ప్రధాని వాజ్‌పేయి చేయాల్సి వుందని ఆయన అన్నారు.వివాద రహిత భూమి ఒక్క నిమిషంలో ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ ద్వారాఅప్పగించవచ్చునని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
