రెండు పరుగులతో భారత్ ఓటమి
న్యూఢిల్లీ: ఇంగ్లాండుతో గురువారం జరిగిన వన్డేలో భారత్ పోరాడి ఓడింది. రెండు పరుగులతో తేడాతో భారత క్రికెట్ జట్టు ఓటమి పాలయింది. గెలుపు కోసం 272 పరుగులు చేయాల్సి వుండగా భారత్ ఎనిమిదివికెట్లు కోల్పోయి 269 పరుగులు చేసింది. చివరలోఅగార్కర్ చేసిన ప్రయత్నం ఫలించలేదు. అగార్కర్ 24 బంతులను ఎదుర్కుని 36 పరుగులు చేశాడు. చివరి రెండు బంతుల్లో ఆరు పరుగులు చేయాల్సిన భారత్ నాలుగు పరుగులు మాత్రమే చేయగలిగింది.
అనంతరం బ్యాటింగ్‌కు దిగిన భారత్ ఓపెనర్ సచిన్ టెండూల్కర్‌వికెట్‌ను చాలా త్వరగా కోల్పోయింది. కెప్టెన్ సౌరబ్ గంగూలీ మొదట చాలా మందకొడిగా ఆడాడు. అనంతరం భారీ షాట్లకు వెళ్లి మూడుసిక్సర్లతో 74 పరుగులు చేశాడు. వీరేంద్ర షెహవాగ్ 42 పరుగులకు ఔటయ్యాడు. గంగూలీకికైఫ్ మంచి తోడ్పాటు అందించాడు. కైఫ్ 64 బంతుల్లో 46 పరుగులు చేశాడు.కైఫ్ అవుట్ కావడంతో ఆట తీరు మారిపోయింది. ఇంగ్లాండు బౌలర్ గిల్స్ ధాటికి భారత బ్యాట్స్‌మెన్ ఒక్కొక్కరేపెవిలియన్ దారి పట్టారు. గిల్స్ ఐదు వికెట్లు తీసుకున్నాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్‌గా ఎంపికయ్యాడు.
ఆరు మ్యాచ్‌ల ఈ సిరీస్‌లో భారత్ మూడు మ్యాచ్‌లు గెల్చుకోగా, ఇంగ్లాండు రెండు మ్యాచ్‌లు గెలిచింది. ఆరో వన్డే ఫిబ్రవరి 3వ తేదీన ముంబాయిలో జరుగుతుంది. ఇంగ్లాండు సరీస్‌ను సమం చేయాలనే పట్టుదలతో వుంది.












Click it and Unblock the Notifications
