కిడ్నాప్ వెనుక భారత్ హస్తం: పాక్
ఇస్లామాబాద్/న్యూఢిల్లీ: అమెరికా జర్నలిస్టుపెరల్ కిడ్నాప్ వెనుక భారత ప్రభుత్వ హస్తం వున్నదని పాకిస్థాన్ గురువారం ఆరోపించింది. ఈ కిడ్నాప్ వెనుకు భారత్ హస్తం వున్నదని మాత్రమే చెప్పగలనని, ఇంత కన్నావివరాల్లోకి వెళ్లలేనని పాకిస్థాన్ ప్రభుత్వ ప్రతినిధి రషీద్ ఖురేషి అన్నారు.
పాకిస్థాన్ ఆరోపణను భారత్ ఖండించింది. ఇది పాకిస్థాన్‌సైనిక ప్రతినిధి కల్పన అని భారత విదేశీ వ్యవహారాల అధికార ప్రతినిధి నిరుపమా రావు అన్నారు. ఇంత కన్నా తాను ఏం చెప్పగలనని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications
