వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
అమెరికా జర్నలిస్టును చంపేస్తాం
న్యూయార్క్‌ః అమెరికా వద్ద వున్న పాక్ తీవ్రవాదుల్ని తక్షణం విడుదల చేయాలని లేకుంటే తమ వద్ద బందీగా వున్న అమెరికా జర్నలిస్టుపెరల్ ను చంపుతామని తీవ్రవాదులు అల్టిమేటం జారీ చేశారు. పాకిస్తాన్ లోని అమెరికా జర్నలిస్టులంతా 24 గంటల్లో దేశంవిడిచివెళ్ళాలని కూడా కోరింది.పెరల్ జర్నలిస్టు ముసుగులో ఇజ్రాయల్ ఇంటిలిజెన్స్‌సర్వీసుకు ఏజెంట్ గా పనిచేస్తున్నాడని తీవ్రవాదులు ఆరోపించారు. పాకిస్తాన్ లో వున్న ఇంకా పరువులు అమెరికా జర్నలిస్టులు కూడా ఇక్కడి నుంచి సమాచారం చేరవేసే ఏజెంట్లుగా మారారని ఆరోపించారు.
పెరల్ తమ దేశానికి చెందిన జర్నలిస్టేని అమెరికా స్పష్టం చేసింది. అయితేపెరల్ వ్యవహారం గంటగంటకూ జటిలం కావడం పట్ల అమెరికా అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Story first published: Thursday, January 31, 2002, 23:53 [IST]