వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మైసురాకు ఉద్వాసన- కాంగ్రెస్‌లోసంక్షోభం

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌:మినీ మున్సిపల్‌ ఎన్నికల్లో ఓటమి రాష్ట్ర కాంగ్రెస్‌లోపెను సంక్షోభాన్ని సృష్టించింది. కడప జిల్లా మైదుకూరు శాసనసభ్యుడు డాక్టర్‌ఎం. వి. మైసురా రెడ్డిని కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) కార్యదర్శి పదవి నుంచి తప్పించారు. ప్రస్తుతం ఆయన ఢిల్లీలో వున్నారు.

ఎన్నికల్లో పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే ఆరోపణపై కాంగ్రెస్‌ లెజిస్లేచర్‌ పార్టీ(సిఎల్‌పి) మాజీ కార్యదర్శి ఎం. కోదండరెడ్డికి ప్రదేశ్‌ కాంగ్రెస్‌ కమిటీ(పిసిసి) షోకాజ్‌ నోటీసు జారీ చేసిన విషయం తెలిసిందే.

మైసురా రెడ్డినికార్యదర్శి పదవి నుంచి తప్పిస్తూ సిఎల్‌పి నేతడాక్టర్‌ వై.యస్‌. రాజశేఖర్‌ రెడ్డి నోటీసు జారీచేశారు. ఎన్నికల్లో పని చేయకపోవడమేకాకుండా తనపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకుతన సూచన మేరకు మైసురా రెడ్డిని కార్యదర్శిపదవి నుంచి తప్పించినట్లు పిసిసి అధ్యక్షుడుఎం. సత్యనారాయణ రావు గురువారం విలేకరులతోచెప్పారు. తనపై వ్యాఖ్యలు చేయడం పార్టీనష్టమని ఆయన అన్నారు.

ఇదిలా వుంటే, పిసిసి షోకాజ్‌ నోటీసులు అందుకున్ననాయకులు ఢిల్లీలో పార్టీ అధిష్టానాన్ని కలిసేందుకుప్రయత్నాలు చేస్తున్నారు. ఓటమికి బాధ్యతవహించ లేక పిసిసి అధ్యక్షుడు ఇతర నాయకులపైవిరుచుకపడుతున్నారని మైసురా రెడ్డి ఢిల్లీలోఅంటున్నారు. పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీని,రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ అంబికా సోనీని తానుకలిసినందుకే తనను సిఎల్‌పి కార్యదర్శి పదవినుంచి తప్పించారని ఆయన వ్యాఖ్యానిస్తున్నారు.తాను పార్టీ క్రమశిక్షణకు కట్టుబడి పని చేస్తున్నాననిఆయన చెపుతున్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X