న్యూఢిల్లీ: అయోధ్యలో రామాలయ నిర్మాణంపై ప్రభుత్వంతో చర్చలు జరిపేందుకు మార్చి 12వ తేదీ వరకు తమ తలుపులు తెరిచే వుంటాయనివిశ్వ హిందూ పరిషత్ (విహెచ్‌పి) ప్రకటించింది. రామాలయ నిర్మాణాన్ని మార్చి 12వ తేదీ తర్వాత చేపడుతామని విహెచ్‌పి కార్యనిర్వాహక అధ్యక్షుడుఅశోక్ సింఘాల్ గురువారం విలేకరులతో చెప్పారు.
ప్రధాని అటల్‌బిహారీ నివేదించిన అంశాల విషయంలో న్యాయ శాఖ మంత్రి నిర్ణయం తీసుకోవడానికి మార్చి 12వ తేదీ దాటితే ఏం చేస్తారనివిలేకరులు అడిగితే రామాలయ నిర్మాణానికి ఏ శుభ తరుణాన్నైనా ఎంచుకుంటామని ఆయన జవాబిచ్చారు. కోర్టు తీర్పుమీకు వ్యతిరేకంగా వస్తే ఏం చేస్తారని అడిగితే- ఈవిషయంలో కోర్టులకు ప్రాముఖ్యం లేదు. విశ్వాసానికి సంబంధించినవిషయంలో కోర్టులు నిర్వర్తించే పాత్ర ఏదీ వుండదు అని ఆయన సమాధానమిచ్చారు.