H-1B Grace Period: 2017 నుంచి ఉన్న వెసులుబాటు రద్దు, అధికారిక ప్రతిపాదన

అమెరికాలో స్థిరపడాలనే ఐటీ నిపుణుల కలలపై డొనాల్డ్ ట్రంప్ సర్కార్ మరోసారి పిడుగు లాంటి వార్త పేల్చింది. ఉద్యోగం ఊడిపోతే కొత్త కంపెనీని వెతుక్కునేందుకు ఇప్పటివరకు ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ను రద్దు చేస్తూ ట్రంప్ యంత్రాంగం సంచలన నిర్ణయం తీసుకుంది. యూఎస్ డిపార్ట్‌మెంట్ ఆఫ్ హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ (DHS) గురువారం ఈ ప్రతిపాదనను అధికారికంగా విడుదల చేసింది. ఈ నిర్ణయం అమల్లోకి వస్తే... ఉద్యోగం కోల్పోయిన మరుక్షణమే విదేశీ ఉద్యోగులు అమెరికా భూభాగాన్ని విడిచిపెట్టాల్సి ఉంటుంది. ఈ ప్రతిపాదిత నిబంధన ముఖ్యంగా భారతీయ ఐటీ రంగాన్ని తీవ్ర భయాందోళనలకు గురిచేస్తోంది.

అమెరికాలో హెచ్-1బీ వీసాలపై పనిచేస్తున్న వారిలో సగానికి పైగా భారతీయులే ఉన్నారు. 2025 ఆర్థిక సంవత్సరంలో ఆమోదించిన కొత్త వీసాల్లో ఏకంగా 50.3 శాతం, వీసా పొడిగింపు పొందిన వారిలో అత్యధికంగా 77.6 శాతం మంది భారతీయులే కావడం విశేషం. టిసిఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సిఎల్, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ వంటి భారతీయ దిగ్గజాలతో పాటు డెలాయిట్, పీడబ్ల్యూసీ వంటి అంతర్జాతీయ కన్సల్టింగ్ సంస్థల్లో వేలాది మంది భారతీయులు పనిచేస్తున్నారు. హఠాత్తుగా ఏ కంపెనీ అయినా లేఆఫ్ ప్రకటిస్తే... మరో ఉద్యోగం వెతుక్కోవడానికి సమయం లేక, ఉన్నపళంగా దేశం విడిచి రావాల్సిన దారుణమైన పరిస్థితి మన సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లకు ఎదురుకానుంది.

Trump Administration Proposes Ending 60-Day H1B Grace Period Major Impact Expected on Indian IT Workers

2017 నుంచి ఉన్న వెసులుబాటు రద్దు

నిజానికి 2017 నుంచి అమలులో ఉన్న 60 రోజుల గ్రేస్ పీరియడ్ విదేశీ ఉద్యోగులకు పెద్ద ఊరటగా ఉండేది. ఈ రెండు నెలల కాలంలో వారు మరో కంపెనీలో ఉద్యోగం సాధించి వీసా ట్రాన్స్‌ఫర్ చేసుకోవడానికి లేదా వేరే వీసా కేటగిరీకి మారడానికి అవకాశం లభించేది. అంతకంటే ముఖ్యంగా పిల్లల చదువులు, ఇళ్ల విక్రయం, ఆర్థిక లావాదేవీలు చక్కబెట్టుకోవడానికి ఈ సమయం ఎంతో ఉపకరించేది. కానీ ట్రంప్ సర్కార్ ప్రతిపాదించిన కొత్త నిబంధన వల్ల ఇవన్నీ ఒక్కసారిగా గందరగోళంలో పడనున్నాయి. చట్టబద్ధమైన ఉద్యోగం లేనప్పుడు వీసాపై అమెరికాలో ఉండటం సరైంది కాదనేది హోమ్‌ల్యాండ్ సెక్యూరిటీ వాదన.

కేవలం హెచ్-1బీ మాత్రమే కాదు.. అందరిపైనా వేటు!

ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన ఈ కొత్త కోత కేవలం హెచ్-1బీ వీసాదారులకే పరిమితం కాలేదు. అంతర్జాతీయ వ్యాపారాలు చేసే ఇ-1, ఇ-2 వీసాదారులు, కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లు వాడే ఎల్-1 వీసా, ప్రత్యేక ప్రతిభ కలిగిన వారికిచ్చే ఓ-1 వీసాదారులతో పాటు ఆస్ట్రేలియా, సింగపూర్, చిలీ దేశాలకు చెందిన వర్క్ వీసాదారులపై కూడా ఈ నిబంధన తీవ్ర ప్రభావం చూపనుంది. జనవరి 2025లో ట్రంప్ మళ్లీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి చట్టబద్ధమైన వలసలపై వరుసగా ఆంక్షలు విధిస్తూ వస్తున్నారు.

తదుపరి పరిణామాలు ఏంటి?

విదేశీ ఉద్యోగులను తగ్గించి, ఆ స్థానాల్లో అమెరికన్లకే అవకాశాలు కల్పించాలనేది ట్రంప్ సర్కార్ భావనగా కనిపిస్తోంది. ప్రస్తుతానికి ఈ ప్రతిపాదనను ప్రజలు, కంపెనీల అభిప్రాయాల కోసం 60 రోజులు)పబ్లిక్ డొమైన్‌లో ఉంచారు. ఈ సమయం పూర్తయ్యాక దానికి తగినట్లుగా తుది చట్టాన్ని రూపొందించి అమలు చేయనున్నారు. ఒకవేళ ఈ నిబంధన గనక అమల్లోకి వస్తే, అమెరికాలోని టెక్ కంపెనీలకు హెచ్‌ఆర్ నిర్వహణ సవాలుగా మారడమే కాకుండా, విదేశీ నిపుణుల భవిష్యత్తు పూర్తిగా అంధకారంలో పడే ప్రమాదం ఉందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+