యాక్సిడెంట్ లో సినీ నిర్మాత మృతి
చిత్తూరుః చిత్తూరు జిల్లా నగరి సమీపంలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలుగు సినీ నిర్మాత యార్లగడ్డ శంభుప్రసాద్ దుర్మరణం పాలయ్యారు. ఈయన ఆంధ్రా ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు కూడా. ఆయనతో పాటు ఆయన సతీమణి ప్రభావతి, పరుచూరి బ్రదర్స్ లో మూడో వారైన పరుచూరి కుటుంబరావు కూడా మరణించారు. మరో ఇద్దరు మహిళలు తీవ్రంగా గాయపడ్డారు.వీరిని తిరుపతిలోని రుయా ఆస్పత్రిలో చేర్పించారు. తిరుపతిలో శ్రీ వెంకటేశ్వరస్వామిని సందర్శించుకొని శంభుప్రసాద్ చెన్నయ్ వెళుతున్నారు.












Click it and Unblock the Notifications
