వచ్చే ఏడాది ఆంధ్రకు బిల్‌గేట్స్‌

న్యూయార్క్‌: వచ్చే ఏడాది భారత పర్యటనకు వచ్చినప్పుడు హైదరాబాద్‌ను సందర్శించడానికి మైక్రోసాఫ్ట్‌ అధినేత బిల్‌గేట్స్‌అంగీకరించారు. మైక్రోసాఫ్ట్‌ అధిపతి బిల్‌గేట్స్‌తో ఆదివారం ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు సమావేశమయ్యారు. రాష్ట్రంలో సాఫ్ట్‌వేర్‌ ప్రగతిని, గేట్స్‌ ఫౌండేషన్‌ కార్యకలాపాలను ఆయన బిల్‌గేట్స్‌కువివరించారు. ముఖ్యమంత్రి కోరిక మేరకు వచ్చే ఏడాది హైదరాబాద్‌ రావడానికి బిల్‌గేట్స్‌అంగీకరించారు.

ఆంధ్రప్రదేశ్‌లో జరిగే భాగస్వామ్య సదస్సులో పాల్గొనాల్సిందిగా ముఖ్యమంత్రి కెనడాను ఆహ్వానించారు. ఆయన ఆదివారం కెనడా ఉప ప్రధాని, కెనడా పరిశ్రమలు, వాణిజ్య మంత్రితో అల్పాహారవిందులో పాల్గొన్నారు. భారత పరిశ్రమల సమాఖ్య(సిఐఐ) నిర్వహించిన ఒక కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొన్నారు. అమెరికా మాజీ అధ్యక్షుడు బిల్‌ క్లింటన్‌, ఆయన సతీమణి హిల్లరీ క్లింటన్‌లతో ఆయన మాట్లాడారు. భారత పర్యటనలో హైదరాబాద్‌కు వస్తానని క్లింటన్‌ చెప్పారు. గోల్డ్‌ మ్యాన్‌ సచ్స్‌ సంస్థ అధ్యక్షుడుహ్యాంక్‌ పాల్సన్‌తో కూడా ముఖ్యమంత్రి సమావేశమయ్యారు.

మోన్‌శాంటోతో అవగాహన

ప్రపంచ ప్రసిద్ధి చెందిన మోన్‌శాంటో తనపరిశోధన, అభివృద్ధి కార్యక్రమాలను ఆంధ్రప్రదేశ్‌లో ప్రారంభిస్తుంది. హైదరాబాద్‌లో ఏర్పాటయ్యే ఐసిఐసిఐ నాలెడ్జ్‌ పార్క్‌లోఈ కంపెనీ పెట్టుబడులు పెడుతుంది. ఈ మేరకు మోన్‌శాంటో కంపెనీ ప్రెసిడెంట్‌, ఛీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ హెండ్రిక్‌ ఎ వెర్‌ఫైలే రాష్ట్రప్రభుత్వంతో ఒక అవగాహనా పత్రంపై సంతకాలు చేశారు. ఆదివారంనాడిక్క ఈ అవగాహనా పత్రంపై సంతకాలు జరిగాయి.

రాష్ట్రంలో బయోటెక్నాలజీని విస్తృత స్థాయిలో అభివృద్ధి చేసేందుకు నాలుగు అమెరికన్‌ కంపెనీలతో రాష్ట్ర ప్రభుత్వం మరో ఎంఒయును కుదుర్చుకుంది. దీనిపై రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధి సంస్థ (ఎపిఐడిసి) వెంచర్‌ క్యాపిటల్‌ లిమిటెడ్‌, అమెరికన్‌ బయోటెక్‌ కంపెనీలు జినోమిక్స్‌ యుఎస్‌ఎ, బయోసెర్వ్‌ యుఎస్‌ఎ, జినోమిక్‌ డిజైన్‌ ఫార్మాస్యూటికల్స్‌, సిలికోఇండైట్స్‌ ఇన్‌కార్పోరేషన్‌లు సంతకాలు చేశాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+