పెరల్ కేసు: అమెరికాకు జిలాని అప్పగింత
ఇస్లామాబాద్: అమెరికా జర్నలిస్టు డేనియల్‌పెరల్ కిడ్నాప్ కేసులో ప్రధాన నిందితుడైన ముబారక్ అలీ షా జిలానీని అమెరికాకుఅప్పగించాలని పాకిస్థాన్ నిర్ణయించుకున్నట్లు సోమవారం ప్రతికలురాశాయి. కిడ్నాప్ వ్యవహారంతో తనకేమీ సంబంధం లేదని, వాల్‌స్ట్రీట్ జర్నల్ కరస్పాండెంట్ పెరల్ ఆచూకీ తనకు తెలియదని చెప్పినప్పటికీ వినకుండా పాకిస్థాన్ జిలానీని అమెరికాకుఅప్పగించాలని నిర్ణయించుకుంది.
పేరు తెలియని సంస్థ కొన్ని సంస్థల నుంచి నాలుగు లక్షల డాలర్లు తీసుకున్నట్లుఅమెరికా అధికారులు ధృవీకరణ పత్రాలు ఇవ్వడంతో జిలానీని అమెరికాకుఅప్పగిస్తున్నట్లు ది నేషన్ అనే పత్రిక రాసింది. ముగ్గురు ప్రముఖ భాతర అధికారులతో జిలానీ మాట్లాడినట్లు పాకిస్థాన్ విదేశీ వ్యవహారాల మంత్రి అబ్దుల్ సత్తార్ మూడు రోజుల క్రితం చెప్పారు. దీంతో జిలానీపేరు కిడ్నాప్ వ్యవహారంలో ప్రముఖంగా ముందుకు వచ్చింది. జిలానీ నాలుగు రోజుల క్రితం రావల్పిండిలో పోలీసులకు లొంగిపోయినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications
