కాశ్మీర్‌పై తాలిబాన్‌ఫైటర్ల దృష్టి
న్యూఢిల్లీ: పాకిస్థానీ తాలిబాన్లు వచ్చే కాలంలో జమ్మూ కాశ్మీర్‌లోపెద్ద యెత్తున హింసకు పాల్పడవచ్చుననే వార్తలువెలువడుతున్నాయి. వేలాది మంది పాకిస్థాన్ తాలిబాన్‌ఫైటర్లను పాకిస్థాన్ రెండు నెలల క్రితం అఎn్ఘానిస్థాన్‌లోని కుందుజ్ నుంచి పాకిస్థాన్ ప్రభుత్వం తీసుకొచ్చి ఇస్లామాబాద్‌లో దింపింది.వీరు జమ్మూ కాశ్మీర్‌లో హింసకు పాల్పడవచ్చునని ఒక మీడియా రిపోర్ట్ తెలియజేస్తోంది.వీరు పాకిస్థాన్ ఆక్రమిత కాశ్మీర్ నుంచి తమ కార్యకలాపాలను సాగిస్తారని రాసింది.
దాదాపు 5వేల మంది తాలిబాన్, ఆల్ ఖయిదా ఫైటర్లను పాకిస్థాన్ 2001 నవంబర్- డిసెంబర్‌లో కుందుజ్ నుంచి ఇస్లామాబాద్‌కు తరలించిందని, వారి సంఖ్య అంత కన్నా ఎక్కువే వుండవచ్చునని ఆయన న్యూస్ ఏజెన్సీ కథనం. హత్యకుగురైన నార్తర్న్ అలయెన్స్ కమాండర్ అహ్మద్ షా మసూద్‌కు సన్నిహితుడైన వ్యక్తి కథనం ప్రకారం ఆ సమయంలో 25 వేల నుంచి 30 వేల మంది తాలిబాన్, ఆల్ ఖయిదాఫైటర్లు వుండేవారు. ఇందులో ఆరు వేల మంది సరెండర్ అయ్యారు.మిగతా వారిని పాకిస్థాన్ విమానాల్లో తరలించింది.
టాప్ తాలిబాన్ నేతల ఆచూకీ తెలియడం లేదు. తాలిబాన్‌సైనిక స్థావరాల్లో వున్న వందలాది క్షిపణుల, ట్యాంక్‌ల, ఆర్టిల్లరీ గన్‌ల ఆచూకీ కూడా తెలియడం లేదు.












Click it and Unblock the Notifications
