పాట్నాః ఏడు వామపక్ష విద్యార్ధి సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు బీహార్‌లో బుధవారం నాడు జరిగిన బంద్ సందర్భంగా ప్రజాజీవితం పూర్తిగా స్తంభించిపోయింది.
భగల్‌పూర్‌లో ఇద్దరువిద్యార్ధుల ప్రాణాలు బలిగొన్న పోలీసు కాల్పుల సంఘటనకు వ్యతిరేకంగావిద్యార్ధి సంఘాలు బంద్‌కు పిలుపునిచ్చాయి. పాట్నాలో దుకాణాలు, వాణిజ్యకేంద్రాలు,విద్యాసంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయలేదు. ట్రాఫిక్ కూడాపెద్దగా కనిపించలేదు.సాయంత్రం వరకు చెప్పుకోదగిన హింసాత్మక సంఘటనలు మాత్రం జరగలేదు. బంద్ సందర్భంగా సుమారుఅయిదువందలమందిని అరెస్టు చేశారు. బంద్‌కుసిపిఐ, సిపిఎం, సిపిఎంఎల్, ఫార్వర్డ్‌బ్లాక్, ఆర్‌ఎస్‌పి వంటి సంస్థలు మద్దతునిచ్చాయి.