ఓడించినవారి అంతుచూస్తాః నాగేందర్
హైదరాబాద్‌ః హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో తమ పార్టీ వారే తనకు వెన్నుపోటు పొడిచారని, ఈ వ్యవహారాన్ని కాంగ్రెస్ అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని కాంగ్రెస్ ఎమ్మెల్ల్యే దానం నాగేందర్ వెల్లడించారు. పిసిసి కార్యదర్శి పి.సుధీర్ కుమార్ పై ఆయన పరోక్షంగావిమర్శనాస్త్రాలు సంధించారు. కాంగ్రెస్ సీనియర్ నేత శివశంకర్ కుమారుడైన సుధీర్ కుమార్ కు మలక్‌పేట నియోజక వర్గంలో మంచి పట్టు వుంది. అయితే మలక్‌పేట నుంచి కనీస స్థాయిలో కూడా ఓట్లు రాలేదని నాగేందర్‌విమర్శించారు. అధిష్టానం చర్య తీసుకోక పోయినా వ్యక్తిగతంగాఅయినా తనను ఓటమి పాలు చేసిన వారిని వదిలిపెట్టనని ఆయన హెచ్చరించారు.












Click it and Unblock the Notifications
