కృష్ణా ఉత్సవాలకు బెజవాడ ముస్తాబు
విజయవాడః ఆంధ్రరాష్ట్రంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేసే లక్ష్యంతో తలపెట్టిన కృష్ణా ఉత్సవాలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. కృష్ణా జిల్లా వైభవాన్ని, సంస్కృతీ సంప్రదాయాలను ఇనుమడింపచేసే విధంగా ఈ ఉత్సవాలను ఏర్పాటు చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌మీనా చెప్పారు. గురువారం నుంచి మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి.విజయవాడ, మంగినపూడి బీచ్, బందర్, దివిసీమల్లో ఈ ఉత్సవాలని ఏర్పాటు చేశారు. జిల్లాలోని అన్ని పర్యాటక కేంద్రాలనువిద్యుత్ దీపాలతో అలంకరించారు.












Click it and Unblock the Notifications
