హైదరాబాద్‌ః సిఎల్‌పి నేత వైఎస్ రాజశేఖర్‌రెడ్డి బుధవారం నాడు ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో ఈ మధ్య కాలంలో చోటుచేసుకున్న అంతర్గత పరిణామాల నేపథ్యంలో ఆయన పర్యటనకు విశేష ప్రాధాన్యత ఏర్పడింది.
రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు, ఎన్నికల్లో కాంగ్రెస్ పనితీరు, సిఎల్‌పి కార్యదర్శిగా మైసూరారెడ్డి తొలగింపు నేపథ్యం వంటివిషయాలను ఆయన అధిష్టానవర్గానికి నివేదించే అవకాశం వుంది. మైసూరారెడ్డి స్థానంలో కొత్త కార్యదర్శిగా ఎవరిని నియమించాలనేవిషయంలో కూడా అధిష్టానవర్గం సలహాను వైఎస్ తీసుకునే అవకాశం వుంది. తన ఢిల్లీ పర్యటన ముందుగానే నిర్ణయమైందని దీనికిపెద్దగా రాజకీయ ప్రాధాన్యత లేదని వైఎస్ చెప్పినప్పటికీ ఢిల్లీ యాత్రకు ముందు పిసిసి నేత ఎం సత్యనారాయణరావును కలిసి ఆయన మంతనాలు జరపడంతో ఈ యాత్ర ప్రాధాన్యత సంతరించుకున్నది. ఎంఎస్‌కు వ్యతిరేకంగా మైసూరా భారీ లేఖను అధిష్టానవర్గానికి రాసినవిషయం విదితమే.