చండీఘర్‌ః పంజాబ్ అసెంబ్లీకి బుధవారం నాడు జరిగిన పోలింగ్ సందర్భంగా వివిధ ప్రాంతాల్లో హింస ప్రజ్వరిల్లింది. అయితే పోలింగ్ మాత్రం అంతరాయం లేకుండానే సాగిందని అధికారులు చెప్పారు. మొత్తం 116 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరిగింది.
ఎగ్జిట్ పోల్‌లో కాంగ్రెస్‌కు 80 నుంచి 90 స్థానాలు లభించే అవకాశం వున్నట్టుగా తేలింది. అధికార శిరోమణిఅకాలీదళ్-బిజెపి కూటమికి పవనాలు వ్యతిరేకంగా వున్నట్టుగా ఈసర్వేలో వెల్లడయింది. అధికార కూటమి తుడిచిపెట్టుకు పోనున్నట్టుగాసర్వే ఫలితాలు వెల్లడించడంతో కాంగ్రెస్ వర్గాల్లో ఎక్కడాలేని ఉత్సాహం వ్యక్తం అవుతున్నది. ఇదిలా వుండగా గురువారం నాడు పోలింగ్ జరుగుతున్న ఉత్తరాంచల్, మణిపూర్,ఉత్తరప్రదేశ్‌లోని నియోజకవర్గాల్లో భారీ ఎత్తున బందోబస్తు ఏర్పాట్లు చేశారు.