హైదరాబాద్‌ః నర్సరావుపేట బాంబు పేలుళ్ల కేసుకు సంబంధించి రాష్ట్రపౌరసరఫరాల శాఖ మంత్రి డాక్టర్ కోడెల శివప్రసాదరావుపై విచారణ జరిపేందుకు సిబిఐకి అనుమతినివ్వాలని మాజీ ఎంపీ కాసు వెంకట కృష్ణారెడ్డి కేంద్ర హోం శాఖకు విజ్ఞప్తి చేశారు.
భారత పేలుడు పదార్ధాల చట్టం కింద కోడెలపైవిచారణ కోసం సిబిఐకి అనుమతి నిరాకరిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని సమీక్షించాలని ఆయనకోరారు. ఒకవేళ కేంద్ర హోం శాఖ తననిర్ణయానికే కట్టుబడి వుండాలని నిర్ణయిస్తే సిబిఐకి జారీ చేసిన ఆదేశాల ప్రతిని తనకుఅందజేయాలని దాని ఆధారంగా తాను చట్టపరంగా ముందుకెళ్తానని కాసుపేర్కొన్నారు. కేంద్ర హోం శాఖ కార్యదర్శి కమల్‌పాండేకు రాసిన లేఖ ప్రతులను ఆయన శనివారం నాడువిలేకరులకు అందజేశారు. పిసిసి అధికార ప్రతినిధి కె కేశవరావు, ప్రధానకార్యదర్శి కె ఆర్ ఆమోస్, లీగల్‌సెల్ కో చైర్మన్ శ్రీపాద ప్రసాద్‌లతో కలసి కృష్ణారెడ్డివిలేకరుల సమావేశంలో పాల్గొన్నారు. కోడెల వల్ల గుంటూరులో బాంబుల సంస్కృతివిస్తరించిందని ఆయన్ను నిరోధించకుంటే గుంటూరు కూడా బీహార్ దారిలోకి వెళ్తుందని కాసు కృష్ణారెడ్డి హెచ్చరించారు. కేంద్ర హోం శాఖతనను కాపాడుతుందనే భరోసాతో కోడెల తన రాజకీయ ప్రత్యర్ధులను అంతమొందించే అవకాశాలు వున్నాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు.