వాషింగ్టన్: చర్చలు ప్రారంభించడానికి పాకిస్థాన్, భారత్‌లకు ఎవరి సహాయమూ అవసరం లేదని అమెరికాలోని భారత రాయబారి లలిత్ మాన్‌సింగ్ అన్నారు. ఎజెండాపై ఇరు దేశాలకు ఒకఅంగీకారానికి రావాల్సి వున్నదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఇరు దేశాలు చర్చలకుఅంగీకరిస్తున్నాయని, అందువల్ల ఇద్దరి మధ్య మధ్యవర్తిత్వం అవసరం లేదని, ఎజెండాపై ఒకఅంగీకారానికి రావాల్సి వున్నదని, ఈ విషయంలో పాకిస్థాన్ వైపు నుంచి సమస్య ఎదురవుతోందని ఆయన అన్నారు. ఇరు పక్షాలు చర్చలకుఅంగీకరించని చోట మధ్యవర్తిత్వం అవసరమవుతుందని, ఇది మధ్య ప్రాచ్యానికి అవసరమవుతుందని, భారత్, పాక్‌లకు అవసరం లేదని ఆయన అన్నారు.