ఆ 20 మందినిఅప్పగించం: ముషారఫ్
ఇస్లామాబాద్: భారత్ డిమాండ్ చేస్తున్న 20 మంది తీవ్రవాదులనుఅప్పగించేందుకు పాకిస్థాన్ అధ్యక్షుడు పర్వేజ్ ముషారఫ్ నిరాకరించారు. లష్కర్-ఎ- తోయిబా, జైష్-ఎ- మహ్మద్ పవిత్ర యుద్ధ కార్యకలాపాలకు విదేశాల్లో ఏజెంట్లుగా మారాయని ఆయన అన్నారు. అమెరికా పర్యటన చేసి వచ్చిన ముషారఫ్ శుక్రవారంవిలేకరులతో మాట్లాడారు. ఆయన చెప్పిన విషయాలు శనివారం పాకిస్థాన్ పత్రికల్లో ప్రచురితమయ్యాయి.
తమ జాతీయ ప్రయోజనాల దృష్ట్యా లష్కర్‌ను, జైష్‌ను నిషేధించినట్లు ఆయన తెలిపారు. తన జనవరి 12 ప్రసంగం తర్వాత భారత్ సరిహద్దుల నుంచి ఉపసంహరించుకోవాల్సి వుండదని, కానీ అలా చేయలేదని,అందుకు భారత్‌కు వుండాల్సిన కారణాలు భారత్‌కు ఉన్నాయని ముషారఫ్ అన్నారు.












Click it and Unblock the Notifications
