శవపేటికలు వాడనే లేదు

లక్నోః కార్గిల్‌ యుద్ధ సమయంలో అమెరికా నుంచి కొనుగోలు చేసిన అల్యూమినియం శవపేటికలను వినియోగించలేదని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రమోద్‌మహాజన్‌ చెప్పారు. ఈ ఒప్పందంలో మడుపులు చేతులు మారాయన్న ప్రతిపక్షాల వాదనను ఆయన కొట్టివేశారు.

ఈ ఒప్పందంలో ముడుపులు చేతులు మారాయన్న ప్రతిపక్షాల వాదనను ఆయన కొట్టివేశారు. 1999లో శవపేటికల కొనుగోలుకు ఆదేశాలు ఇచ్చారని, యుద్ధంలో మరణించినసైనికుల మృతదేహాలను వారి ఇళ్లకు చేరవేయడానికి శవపేటికల కోసం ఆర్డరిచ్చినట్టుగా ఆయన చెప్పారు. ఇప్పటి వరకూ యుద్ధంలో మరణించినసైనికుల అంత్యక్రియలను యుద్ధరంగంలోనే నిర్వహించి కేవలం వారి దుస్తులను ఇతర వస్తువులను మాత్రమే కుటుంబ సభ్యులకుఅప్పగించినట్టుగా ఆయన వెల్లడించారు. కార్గిల్‌ యుద్ధంలో కొన్ని సందర్భాల్లో శవపేటికలను ఉపయోగించినప్పటికీ అవి కూడా చెక్కతో చేసినవేనని ఆయన చెప్పారు. కనీసం ఇస్త్రీ బట్టలు కూడా వేసుకోని జార్జ్‌ ఫెర్నాండెజ్‌ను ముడుపులు తీసుకున్నారని ఆరోపించడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు.
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+