సిద్దిపేటః మెదక్ జిల్లా సిద్దిపేట మండలంలోని పుల్లూరు శివారులో శనివారం మధ్యాహ్నం జరిగిన ఎన్‌కౌంటర్‌లో ఆవునూరి రైతాంగ గెరిల్లా ధళ సభ్యుడు మృతిచెందినట్టుగా జిల్లా ఎస్పి ఆపరేషన్స్ చారుసిన్హా చెప్పారు.
సిద్దిపేట రూరల్ ఎస్‌ఐసీతారామ్ ఆధ్వర్యంలోని పోలీసు బృందం పుల్లూరు శివారులో గాలిస్తుండగారైతాంగ గెరిల్లా సభ్యులు పోలీసులపైకి కాల్పులు ప్రారంభించారు. వెంటనే పోలీసులు అప్రమత్తులై ఎదురు కాల్పులు జరపగా ఒకరు మరణించారని చారుసిన్హా చెప్పారు. మృతిడిని మాచాపూర్‌కు చెందినమిట్టపల్లి లక్ష్మణ్ (20)గా గుర్తించారు. మృతునికి పలు నేరాలతో సంబంధం వున్నట్టుగా ఆయన వెల్లడించారు.