వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లాంతర్లు, క్యాండిల్స్‌ తో కాంగ్రెస్‌ నిరసన

By Staff
|
Google Oneindia TeluguNews

హైదరాబాద్‌ః గవర్నర్‌ రంగరాజన్‌అసెంబ్లీ లో ప్రసంగిస్తున్న సమయంలోనే కరెంట్‌ పోయిందని, భవిష్యత్తులో రాబోయేవిద్యుత్‌ కోతకు ఇది నిదర్శనమంటూ కాంగ్రెస్‌ ధ్వజమెత్తింది. సోమవారం నాడుఅసెంబ్లీ లో కాంగ్రెస్‌ పార్టీ కరెంట్‌ కోతపై వినూత్నరీతిలో నిరసన వ్యక్తం చేసింది. కొవ్వొత్తులు, చిట్టి లాంతర్లతో పాటు కాంగ్రెస్‌ పార్టీకి చెందిన ఎమ్మెల్ల్యేలంతాఅసెంబ్లీలోకి ప్రవేశించారు. చివరకు అసెంబ్లీ ఆవరణలో సైతం వారు క్యాండిల్స్‌ వెలిగించి, లాంతర్లు చేతిలో పట్టుకొని వెరైటీగా నిరసన తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీవిద్యుత్‌ ఛార్జీలను పెంచే ఆలోచనలో వున్నదనే వార్తల నేపధ్యంలో కరెంట్‌ వ్యవహారం సున్నితంగా మారింది. మూలిగే నక్కపై తాడిపండు పడినట్లుఅసెంబ్లీ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం రోజు గవర్నర్‌ ప్రసంగిస్తుండగాఅసెంబ్లీలో కరెంట్‌ పోవడం సంచలనం కలిగించింది. ప్రభుత్వం ఈ వ్యవహారంపైవిచారణకు ఆదేశించింది. అయితే కరెంటు పై ఉద్యమించి తీరాలని పట్టుదలగా వున్న కాంగ్రెస్‌ పార్టీకి ఇది మంచి అవకాశంగా లభించింది. కొవ్వొత్తులు, లాంతర్లతో ఈ వేసవిఅంతా ప్రజలు కష్టాలు పడతారని సూచించే విధంగా ఈ వినూత్న నిరసనకు కాంగ్రెస్‌శ్రీకారం చుట్టింది.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X