అయోధ్య ఎన్నికల ఎజెండా కాదు: జార్జి
పాట్నా: అయోధ్య ఉత్తరప్రదేశ్‌అసెంబ్లీ ఎన్నికల్లో జాతీయ ప్రజాస్వామ్య కూటమి (ఎన్‌డిఎ) ఎజెండా కాదని రక్షణ మంత్రి, సమతా పార్టీసీనియర్ నేత జార్జి ఫెర్నాండెజ్ అన్నారు. ప్రతిపక్షాలు అనవసరంగా ఈవిషయంలో ఎన్‌డిఎను దుయ్యబడుతున్నాయని ఆయన అన్నారు. ఎన్నికల ప్రచారం కోసం ఉత్తరప్రదేశ్‌కు సోమవారం బయలుదేరే ముందు ఆయన బీహార్‌లోని బుక్సర్‌లోవిలేకరులతో మాట్లాడారు.
పాక్ యుద్ధం జరిగే అవకాశాలు లేవని, సరిహద్దుల వద్ద పరిస్థితి ప్రశాంతంగా వుందని, కానీ తాము అప్రమత్తంగానే వున్నామని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications
