స్పీట్‌కు జీవిత ఖైదు మాత్రమే!
సిడ్నీ: ఫిజీ తిరుగుబాటు నాయకుడు జార్జ్‌స్పీట్‌కు విధించిన మరణ శిక్షను అధ్యక్షుడు జొసెఫొ లోయిలో జీవిత ఖైదుగా మార్చారు. భారత సంతతికి చెందిన మహేంద్ర చౌదరి ప్రభుత్వాన్ని కూల్చడానికి జరిగిన కుట్రకు నాయకత్వం వహించినస్పీట్‌కు హైకోర్టు మరణ శిక్ష విధించింది. ఈ శిక్షను అధ్యక్షుడు తగ్గించారు.
హైకోర్టు నిర్ణయం డీల్‌లో భాగంగానే వెలువడిందని ఫిజీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. దేశ ద్రోహ కేసుల్లో గరిష్ట శిక్షను జీవిత ఖైదుగా మారుస్తూ వారం రోజుల క్రితమే ప్రధాని లైసేనియా ఖరేసి మంత్రి వర్గం ఒక బిల్లును ప్రతిపాదించింది. ఈ బిల్లు ఇంకా ఆమోదం పొందలేదు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఖరేసికి మెజారిటీ లేదు. దీంతోస్పీట్ పార్టీకి చెందిన ఐదుగురు సభ్యుల మద్దతు కోసం ఈ వైఖరి తీసుకున్నట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications
