ఆంధ్రా బడ్జెట్ లో 7.499 కోట్ల లోటు
హైదరాబాద్‌ః 7,499 కోట్ల రూపాయల ద్రవ్య లోటుతో 2002-2003 ఆర్థిక సంవత్సరంబడ్జెట్ ను రాష్ట్ర ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ప్రవేశపెట్టారు. విలక్షణ రీతిలో ఈ సారి నెలరోజుల ముందుగానేబడ్జెట్ ముసాయిదాను ప్రజలముందు వుంచినవిషయం విదితమే. ముసాయిదాలో వున్న అంశాలలో ప్రజల సూచన మేరకు కొన్ని మార్పులు చేసి గురువారం మధ్యాహ్నం 1 గంటకుబడ్జెట్ ను శాసనసభలో ప్రవేశ పెట్టారు.
ప్రణాళికా కేటాయింపులు - 10,091 కోట్లు (గత ఆర్థిక సంవత్సరం కంటే ఇది 12.12 శాతం అధికం)
ద్రవ్య లోటు - 7,499 కోట్లు
వివిధ శాఖలకు కేటాయింపులుః
వ్యవసాయం - 446 కోట్లు
విద్య - 3,482 కోట్లు
ఇరిగేషన్ - 2,091 కోట్లు
పంచాయతీ - 2,541 కోట్లు
విద్యుత్ - 2,566
బడ్జెట్ విశేషాంశాలుః
- దేశ చరిత్రలో మొట్టమొదటిసారిగాబడ్జెట్ ను ముందుగానే ప్రజల ముందుంచడం.
- 75 కోట్లతో వ్యవసాయ నిధిని ఏర్పాటు చేయడం.
- 10 కోట్ల రూపాయలతో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఏర్పాటు.
- 10వ పంచవర్ష ప్రణాళికకు అనుగుణంగా 2006-07 వరకు ఆర్థిక వ్యూహానికి ఈబడ్జెట్ ను నాందిగా రూపొందించడం.












Click it and Unblock the Notifications