యుపిలో హంగ్- మణిపూర్‌లో కాంగ్రెస్
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్‌లో హంగ్‌అసెంబ్లీ ఏర్పడుతుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు తేలుస్తున్నాయి. ఉత్తరప్రదేశ్‌లో మూడు విడతలు జరిగిన పోలింగ్‌లో సమాజ్‌వాదీ పార్టీకి అత్యధిక స్థానాలు వస్తాయని దూరదర్శన్ ఎగ్జిట్ పోల్‌సర్వే తెలుపుతుండగా బిజెపికి స్వల్ప మెజారిటీ వస్తుందని ఆజ్‌తక్‌సర్వే అంటోంది.
దూరదర్శన్ ఎగ్జిట్ పోల్ సర్వే ప్రకారం- గురువారం పోలింగ్ జరిగిన 166 స్థానాల్లో ఎస్‌పి 69, బిజెపి 46, బిఎస్‌పి 32, కాంగ్రెస్ 32సీట్లు గెల్చుకుంటాయి.
మొత్తం 60 స్థానాలున్న మణిపూర్ శాసనసభలో కాంగ్రెస్ 32 స్థానాలను దక్కించుకుంటుందని దూరదర్శన్ ఎగ్జిట్ పోల్‌సర్వే తేల్చింది. మణిపూర్ కాంగ్రెస్ పార్టీకి 12 స్థానాలు వస్తాయనిఅంచనా వేసింది. రెండవ విడత పోలింగ్ జరిగిన 20 స్థానాల్లో కాంగ్రెస్‌కు 12సీట్లు, ఎంఎన్‌సిపికి ఒక స్థానం దక్కుతాయని దూరదర్శన్‌అంచనా వేసింది.












Click it and Unblock the Notifications