పనికి ఆహారం కోసం ఆసెంబ్లీ తీర్మానం
హైదరాబాద్‌ః పనికి ఆహార పథకాన్ని వచ్చేజూన్ వరకు పొడిగించాల్సిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతూ ఆంధ్రప్రదేశ్‌అసెంబ్లీ గురువారం ఒక తీర్మానం ఆమోదించింది.పేదలు, బడుగు వర్గాలకు ప్రాణదాతగా మారిన ఈ పథకాన్ని పొడిగించడంఎంతైనా అవసరమని ప్రభుత్వం అభిప్రాయపడింది. ఈ పథకం కొనసాగాలన్నదే తమ అభిమతమని అయితే పనికి ఆహార పథకం తెలుగుదేశం ఆహార పథకంగా మారిందంటూ ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. పనికి ఆహార పథకం ద్వారా కేంద్ర నుంచిఅందుతున్న బియ్యంలో 60 శాతం దుర్వినియోగం అవుతున్నాయని,మిగిలినవి తెలుగుదేశం కార్యకర్తలకే అందుతున్నాయని కాంగ్రెస్ లెజిల్లేచర్ పార్టీ నాయకుడు వై.ఎస్. రాజశేఖర రెడ్డి ధ్వజమెత్తారు.












Click it and Unblock the Notifications